ఏదైనా విషయం తెలుసుకోవాలంటే గూగుల్ లో వెతకడం అలవాటుగా మారింది. కావాల్సిన ఏ విషయం అయినా సరే గూగుల్ లో దొరుకుతుంది. అయితే ఆగస్టులో భారతీయులు ఎక్కువుగా సెర్చ్ చేసిన వాటి గురించి గూగుల్ ఓ జాబితాను విడుదల చేసింది.

అయితే ఆగష్టు నెలలో ఎక్కువుగా రష్యన్ వ్యాక్సిన్ గురించి, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం గురించి భారత స్వతంత్ర దినోత్సవం గురించి సెర్చ్ చేశారు. ఇక జియోలో కాలర్ ట్యూన్ ను ఎలా ఆపాలి, అమీత్ షాకి కరోనా పాజిటివ్ నా, బట్టలపై కరోనా ఎంత కాలం ఉంటుంది, మాజీ రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీకి కరోనా, ఎస్పీ బాల సుబ్రమణ్యంకు కరోనా, కరోనా లక్షణాలు ఎన్ని రోజులలో కనిపిస్తాయి, భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు లాంచ్ చేస్తారు, కరోనాలో ఉష్ణోగ్రత ఎంత, ఒళ్ళు నొప్పులు కరోనాకు సంకేతమా తదితర విషయాల గురించి నెటిజన్లు ఎక్కువుగా సెర్చ్ చేశారు.

అద్భుతమైన ఫీచర్లతో పోకో ఎం2 వచ్చేసింది..!

గంగవ్వకు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధికం..!