ప్రతి ఏడాది చివర్లో గూగుల్ సినిమా ట్రేండింగ్ లకు సంబంధించి టాప్ 10 విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా గూగుల్ టాప్ ట్రేండింగ్ కు సంబంధించిన సినిమాలను విడుదల చేయగా పాన్ ఇండియా సినిమాలుగా విడుదలైన “సైరా, సాహో” సినిమాలకు స్థానం దక్కలేదు. వీటితో పాటి ఈ లిస్ట్ లో ఒక్క సౌత్ ఇండియా సినిమాకు కూడా చోటు దక్కలేదు.

మొత్తం టాప్ 10 ట్రేండింగ్ సినిమాలలో 7 బాలీవుడ్ సినిమాలు ఉండగా, మూడు హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో అర్జున్ రెడ్డి రీమేక్ గా బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా చేసిన ‘కబీర్ సింగ్” సినిమా టాప్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. ఇక వరుసగా టాప్ పొజిషన్ లో ఆ తరువాత అవెంజర్స్ ఎండ్ గేమ్, జోకర్, కెప్టెన్ మర్వెల్, సూపర్ 30, మిషన్ మంగళ్, గల్లీ బాయ్, వార్, హౌస్ ఫుల్ 4, యూరి సినిమాలో టాప్ ప్లేస్ లో నిలిచాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •