ఒక్కప్పుడు దివంగత నేత వైఎస్సార్ కి, ఇప్పుడు జగన్ కి సన్నిహితం గా ఉండే కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. పాణ్యం నుండి ఈ సారి వీరికి టికెట్ రాదన్న భావనలో ఉన్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందన్న బావనతో వీరు పార్టీ మారినట్లు భావిస్తున్నారు. ఒకప్పుడు గౌరు వెంకటరెడ్డి కోసం వైఎస్ రాజశేఖరెడ్డి స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శిస్తే అప్పట్లో తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శలు చేశారు. కాగా గౌరు దంపతులు తొమ్మిదో తేదీన టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు.

gouru charitha reddy