ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటీర్లు నిన్న విధులలో హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షల 69 వేల మంది గ్రామ వాలెంటీర్లుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వారందరికీ నిన్న బాధ్యతలు అప్పగించి విధులలో చేరాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. కానీ ఈ మొత్తంలో దాదాపుగా ఒక 18 వేల మంది విధులలో చేరేందుకు ఆసక్తి చూపించలేదట.

దానికి కారణం వారికి ఇస్తున్న 5 వేల జీతంతో వారు విధులలో చేయవలసిన పనులు ఎక్కువ ఉండటమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విధులలో చేరలేదని చెబుతున్నా 18 వేల మంది ఇతర ప్రాంతాలలో ఏదో ఒక వర్క్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. కానీ జగన్ ప్రభుత్వం వేరే ప్రాంతాలలో ఒకవేళ ఉద్యోగాలు చేస్తుంటే వారు గ్రామ వాలంటీర్లుగా అర్హులు కాదని చెప్పడంతో అలాంటి వారు ఇప్పుడు తరువాత ఇబ్బందులకు గురి కావడం ఎందుకని తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •