ఖర్చు భారీగా పెట్టించే దర్శకులలో రాజమౌళి ముందు వరుసలో ఉంటాడన్న సంగతి అందరకి తెలిసిందే. కానీ రాజమౌళి కన్నా ముందు ఒకప్పుడు బారి బారి సెట్టింగ్స్ తో సినిమాలను దర్శకుడు గుణశేఖర్ నిర్మిస్తుండేవాడు. గుణశేఖర్ సినిమా అంటే భారీతనంతో కూడిన సినిమాలు దర్శనమిస్తాయి. అతడి సినిమాల వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆడితే సూపర్ హిట్ లేకపోతే రెండో రోజే థియేటర్ల నుంచి సినిమాను ఎత్తేసే అంత చెత్తగా ఉంటుంది. అలాంటి గుణశేఖర్ దగ్గుబాటి రానా హీరోగా “హిరణ్యకశ్యప” సినిమాను అనౌన్స్ చేసాడు.

ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ మొత్తం రెడీ చేశారు కూడా. కానీ ఎందుకో అది మాత్రం ముందుకు కదలడం లేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి అనేక వార్తలు లీకులు ఇస్తున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించాలన్న ఎందుకో వర్క్ అవుట్ కావడం లేదు. దీనితో దగ్గుబాటి రానా “హాదీ మేర సాధీ, విరాటపర్వం” పూర్తిచేసి ఇప్పుడు “అయ్యప్పన్ కోషియమ్” రీమేక్ పైకి వెళుతున్నాడు. కానీ మరో “హిరణ్య కశ్యప” ఏమైందో తెలియదు, దీనితో గుణశేఖర్ ఇప్పుడు మరొక సినిమాను అనౌన్స్ చేసాడు.

భరతుడు పుట్టుకకు భారతదేశానికి మూలస్థంభమయిన శకుంతల-దుష్యంత్ ల ప్రేమ వ్యవహారం గురించి సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు.దీనిపై వర్క్ కూడా మొదలుపెట్టేసాడట. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రానుందట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తిచేసుకొని పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలన్న “హిరణ్యకశ్యప” పరిస్థితి అంతంత మాత్రంగా ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. ఇప్పుడు ఈ “శంకుతలం” ప్రేమ కావ్యం ఎప్పటికి షూటింగ్ మొదలవుతుంది తెలియని పరిస్థితి. ఈమధ్య గుణశేఖర్ భారీతనంతో కూడిన సినిమాలు చూసి ప్లాప్ కావడంతో కాస్త అతడిపై నిర్మాతలకు నమ్మకం సన్నగిల్లింది.