ఎప్పటికైనా ఏపార్టీకైనా కార్యకర్తలే మూల స్థంబాలు… పార్టీ అధికారంలో ఉంటే తామే లీడర్స్ అన్నట్లు వ్యవహరించే నేతలు, అధికారం కోల్పోయిన తరువాత ఎంచక్కా ఇంటికి పరిమితమై పార్టీని గాలికి వదిలేస్తే కార్యకర్తలు మాత్రం కష్టపడి వచ్చే ఐదు సంవత్సరాలు జెండా పట్టుకొని, సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలపై పోరాటం చేసి తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉంటారు. పార్టీ మీద ప్రేమ పెంచుకుంటారు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత కష్టపడిన కార్యకర్తలను దూరం పెట్టేస్తారు. అందుకే బాసు కార్యకర్తలు ఎప్పటికి గొర్రెలతో సమానమే. 

ఇప్పుడు ఇదే సీన్ గుంటూరు జిల్లాలో ఒక వెలుగు వెలిగి నాయకులుగా చెలామణి అవుతున్న వారు చేస్తున్న పని. అధికారంలో ఉన్న అన్ని రోజులు అంతా తామై వ్యవహరించి అధికారం కోల్పోయాక ఇళ్లకే పరిమితమవుతున్నారు. వారిలో ఒకరు కోడెల శివప్రసాద్ రావు కాగా, మరొకరు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ఇక కోడెల శివప్రసాద్ రావు కొడుకు, కూతురు చేసిన పనికి మొహం చెల్లక బయటకు కూడా రావడం లేదట. ఇక పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేసారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు కూడా ఇప్పటికే తాము కొత్త నేతను ఎన్నుకుంటామని పార్టీ అధికారంలో ఉన్న అన్ని రోజులు కొడుకు, కూతురు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో ప్రజలను రక్తంలా పీల్చుకుని తిన్నారని అసలు తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని అంటున్నారట.

ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని పైనా ఎన్ని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ వ్యాపారానికి సంబంధించి ఇప్పటికే అనేకమైన కేసులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. పార్టీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారట. ఇక కార్యకర్తలు మాత్రం నమ్ముకున్న పార్టీని వదులుకోలేక పల్లెలో తమ జెండా పట్టుకొని వచ్చే ఐదు సంవత్సరాలలో పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారు. అందుకే బాసు కార్యకర్తలు అప్పుడు… ఇప్పుడు… ఎప్పుడు గొర్రెలే.

 


Tags: Guntur, tdp


  •  
  •  
  •  
  •  
  •  
  •