కరువు ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించాలని కోరుతూ అనేక ఉద్యమాలు చేశారు దివంగత మాజీ ఎంపీ అనంత వెంకట రెడ్డి. ప్రస్తుతం అనంత వెంకట రెడ్డి తనయుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇక అనంత వెంకట రెడ్డి చేసిన పోరాటాలకు గుర్తింపుగా 2007 లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుకు ‘అనంత వెంకట రెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి’గా నామకరణం చేశారు.

అయితే 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టుకు అనంత వెంకట రెడ్డి పేరును తొలగించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టుకు అనంత వెంకట రెడ్డి పేరును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియచేసారు.

తెలంగాణలో 100 దాటిన కరోనా మరణాలు..!

జార్జ్ ఫ్లాయిడ్ హాత్య కేసులో మరో ముగ్గురును దోషులుగా తేల్చిన కోర్టు.. నలభై ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం