హర్యానాలో సూపర్ ఫేమస్ డేరాబాబా గురించి ప్రతి ఒక్కరకి తెలిసే ఉంటుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం డేరాబాబాను పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను అడ్డుకుంటూ డేరాబాబా శిష్యులు చేసిన దాడులతో వందల కోట్ల ఆస్తులకు నష్టం కలిగింది. డేరాబాబా సామ్రాజ్యాన్ని టచ్ చేయలేక చాల రోజులు పోలీసులు అవస్థలు పడ్డారు. డేరాబాబా ఆశ్రమంలో జరుగుతున్న అరాచకాలు;అను పోలీసులు చివరకు ఎట్టకేలకు భగ్నం చేసిన డేరాబాబాతో పాటు అతడి దత్త పుత్రికగా చెప్పుకునే హానీ ప్రీత్ సింగ్ ను కూడా అరెస్ట్ చేసి జైలు ఊచలు లెక్కపెట్టించారు. ఈ కోపంతోనే గత నెలలో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో డేరాబాబా శిష్యులు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని అందుకే బీజేపీకి సీట్లు తగ్గాయని కూడా అంటుంటారు.

ఇక ఇప్పుడు డేరాబాబా దత్త పుత్రిక హనీప్రిత్ నిన్న జైలు నుంచి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చింది. ఆమె నేరుగా డేరాబాబాకు చెందిన సిర్సాలోని డేరా సచ్చాసౌధకు అర్ధరాత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె రాకను పురస్కరించుకొని వేలాది మంది డేరాబాబా భక్తులు ఆమెకు ఘన స్వాగతం చెప్పడంతో పాటు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ పరిణామాలు చూసి ఆమె విస్తుపోయారట.

తాము దేశ ద్రోహం కేసుతో పాటు, ఎన్నో అరాచకాలు డేరాబాబా ఆశ్రమంలో చేసినట్లు ఆరోపణలు వచ్చినా ఈ పిచ్చి జనం ఇంకా తమనే నమ్ముతున్నారని ఒకపక్క ఉద్విగ్నానానికి లోనైందట. మరోవైపున ఆమె కోసం ప్రముఖ మీడియా సంస్థలన్నీ డేరా స్వచ్ఛ సౌధకు చేరుకున్నా ఆమె వారితో మాట్లాడకుండా వెళ్లిపోయింది. డేరాబాబానా మజాకా… ఆమె దత్త పుత్రికకే ఇలా ఉంటే ఇక డేరాబాబానే బయటకు వస్తే తీన్మార్ ఆడి హర్యానా మొత్తం దుమ్ము దుమారం చేస్తారేమో.

  •  
  •  
  •  
  •  
  •  
  •