దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు తీసి టెస్ట్ లలో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసి ముత్తయ్య మురళీధరన్ సరసన చేరాడు. శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ 66 మ్యాచ్ లలో గతంలో 350 వికెట్లు తీస్తే, అశ్విన్ కూడా అదే 66 మ్యాచ్ లలో 350 వికెట్లు తీసి రికార్డులలోకి ఎక్కాడు. అనిల్ కుంబ్లే ఇదే 350 వికెట్లను 77 టెస్టులలో తీయడం జరిగింది.

దీనిపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్… అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్ మిగతా ప్లేయర్స్ కంటే మెరుగైన ప్రదర్శన చూపిస్తాడని, త్వరలో తన రికార్డు 417 ను బ్రేక్ చేస్తాడని, అంతే కాకుండా టెస్ట్ లలో 500 నుంచి 600 వికెట్లు తీయగల సత్తా అశ్విన్ కు ఉందని అన్నాడు.