టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గత కొన్నేళ్లుగా సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ అనే మహిళతో డేటింగ్ లో ఉన్నాడు. త్వరలో తాము పెళ్లిచేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించాడు. కాని అది చెప్పిన కొన్ని రోజులకే తన కాబోయే భార్య నటాషా గర్భవతి అని చెప్పి అభిమానులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. నటాషా ఈరోజు పండంటి బిడ్డకు ఈరోజు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని అతడు తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఇప్పుడు బిడ్డ కూడా పుట్టేయడంతో త్వరలో ఆమెను పెళ్లి చేసుకొని ఆఫీసియల్ గా ఒక ఇంటివాడై పోతాడేమో చూడాలి. ఇప్పటికే హార్దిక్ పాండ్య- నటాషాకు నిచ్చితార్ధం అయిపోయినట్లు తెలుస్తుంది. ఇక అతడికి పుత్రుడు జన్మించడంతో మంచి ఉత్సాహంగా ఉన్నాడు.