కొడంగల్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం తెరాస గెలుస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో కొడంగల్‌కు చెందిన వివిధ పార్టీల నేతలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొడంగల్‌కు తాగు, సాగునీరు టీఆర్‌ఎస్‌తోనే సాద్యమన్న ఆయన.. ఈ నలభై రోజులు మీరు పార్టీ కోసం కష్టపడితే.. అరవై నెలలు మీ కోసం కష్టపడుతామని ఆయన స్పష్టం చేశారు.

మహాకూటమి గెలిస్తే తెలుగుదేశంకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ఒప్పందం కుదిరిందన్న ఆయన.. ఆ రెండు శాఖలు ఒకటి సాగునీటి శాఖ అయితే మరొకటి హోంశాఖ అని అన్నారు. సాగునీటి శాఖను తీసుకొని తెలంగాణను ఎండబెట్టాలని, హోంశాఖ తీసుకొని ఓటుకు నోటు కేసు నుంచి బయట పడాలని టీడీపీ కుట్ర పన్నిందని మండిపడ్డారు హరీష్.