నరదిష్ఠి తగిలితే నాపరాయి కూడా మిగిలిపోతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకని మీ ఇంటి ముందు దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టమని చాల మంది చెబుతుంటారు. మనకు బూడిద గుమ్మడి కాయను ఇంటి గుమ్మానికి కట్టుకోవడంతో పాటు, దాని విలువ తెలిసిన వారు వంట చేసుకోవడం కూడా చేస్తుంటారు. బూడిద గుమ్మడి కాయను ప్రతిరోజు తింటూ ఉంటే కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి బయట పడేందుకు కూడా ఉపయోగించవచ్చు. బూడిద గుమ్మడి కాయ వలన మలబద్ధకాన్ని మాయం చేయవచ్చని చెబుతున్నారు.

స్థూలకాయులు, మధుమేహం ఉన్నవారికి బూడిద గుమ్మడి కాయ మంచి ఆహారంగా వారి ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పనిచేస్తుంది. బూడిద గుమ్మడి కాయ లివర్ వ్యాధులకు మంచిది, దీనిని దంచి అరచెంచా పొడిని వేడి నీటితో కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీని వలన ఉబ్బసం వ్యాధి తగ్గడమేగాక, శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. ఊపిరితిత్తులకు బలాన్ని ఇవ్వడమే గాక రక్తాన్ని వృద్ధి చేస్తుంది.

బూడిద గుమ్మడి కాయ విత్తనాల నుండి తీసిన నూనెను చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. బూడిద గుమ్మడి కాయ రసం తాగితే హైబిపి కంట్రోల్ చేయడమే కాకుండా, నిద్రలేమి నుంచి దూరం చేస్తుంది. దీనిలో ఉండే కార్బోహైడ్రేడ్ లు, కొవ్వు అతి తక్కువ శాతం ఉండటంతో ఇది డైట్ చేసే వారికి మంచి ఫుడ్. దీని గింజలను కొబ్బరి నూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టిస్తే బాగా పెరగడమే కాకుండా, జుట్టు ఊడటం తగ్గుతుంది.