ఈమధ్య ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఎప్పుడు ఎలా గుండె జబ్బు వస్తుందో తెలియడం లేదు. 20 ఏళ్ళ వయస్సు నుంచే గుండె జబ్బులు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎంతో ఆందోళన చెందుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాలని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమందికి సమయం లేకపోవడంతో జీవితమంతా హడావిడిగా గడిచిపోతుంది.

ఒక్కసారి గుండె పోటు వస్తే తరువాత రెండవ సారి ఏ క్షణానైనా రావచ్చు. అలాంటి వారు చాల ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఉండాలి. ఇక ఒక్కసారి గుండె జబ్బులు వచ్చిన వారికి రెండవ సారి గుండె పోటు రాకుండా గుండెకు రక్షణ కల్పించే సరికొత్త ఆయుధాన్ని కెనడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుండెపోటు కారణంగా హృదయంలో చారలు ఏర్పడతాయి. అవి కొన్ని సార్లు గుండె వైఫల్యానికి దారి తీసి గుండెపోటు వచ్చేలా చేస్తాయి.

కెనడా శాస్త్రవేత్తలు తయారుచేసిన ఎస్ఆర్ 9009 ఔషధం హృదయంలో ఏర్పడే చారల కారణంగా హృదయాన్ని బలహీనపరిచే జన్యువులను నియంత్రిస్తుందని యూనివర్సిటీ అఫ్ గ్వల్ఫ్ కు చెందిన పరిశోధకుడు టమీ మార్టీనో తెలిపారు. కెనడాలో కనుగొన్న ఈ ఔషదం మన దేశానికీ ఎప్పుడు వస్తుందో… ఇక్కడ గుండె జబ్బుల బాధితులకు ఉపశమనం ఎప్పుడు కల్పిస్తారో.