కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూసివేశారు. అయితే సోమవారం నుండి పలు రాష్ట్రాలలో మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందు బాబులు భారీ ఎత్తున మద్యం కోసం షాపుల వద్దకు చేరుకున్నారు. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు.

అయితే ఉత్త‌రాఖండ్‌లోని నైనిటాల్‌లో భారీ వడగళ్ల వర్షం పడుతున్న మందుబాబులు లెక్కచేయకుండా క్యూలోనే నిలబడ్డారు. వారందరు భౌతిక దూరాన్ని పాటిస్తూ వర్ష పడితే మాకేంటి అన్నట్లు కిలోమీటర్ల మేర మద్యం కోసం నిల్చున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.