తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా కొత్త కొత్త పొగడలతో ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా మహిళా ఆర్టిస్టులను రప్పించి సినిమాలలో నటింప చేయడానికి దర్శక, నిర్మాతలు ఎక్కువగా పరితపిస్తున్నారు. దీనివల్ల తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న మహిళా ఆర్టిస్టులకు పని దొరకకు రోజులను వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై సీనియర్ నటి హేమ కొంత భావోద్వేగానికి గురయ్యారు.

ఆదివారం హైదరాబాద్ లో టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నటి హేమ మాట్లాడుతూ నిర్మాత దర్శకులకు మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నా ఇక్కడ ఉన్న మహిళా ఆర్టిస్టుల పొట్ట కొట్టి బయట నుంచి మహిళలను తీసుకు వచ్చి వారికి ఉపాధి కల్పించవద్దని, ఇక్కడ ఉన్న మహిళా ఆర్టిస్టులకు పని దొరకక చాల ఇబ్బంది పడుతున్నారని, “మా” అసోసియేషన్ లో దాదాపుగా 800 మంది ఆర్టిస్టులలో 150 మంది మహిళలు ఉంటారని వారికి కనీసం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇవ్వలేమా అని ఉద్వేగానికి లోనైంది. మీ కాళ్లకు దణ్ణం పెట్టి అడుగుతున్నా మహిళా ఆర్టిస్టులను ఆదుకొని, పొరుగు రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి మహిళను తీసుకువచ్చి నటింప చేసి ఇక్కడ ఉన్న వారి పొట్ట కొట్టవద్దని కన్నీళ్ల పర్యంతమైంది. హేమ నిర్ణయాన్ని నిర్మాత, దర్శకులు పాటించి ఇక్కడ వారికే అవకాశం ఇచ్చి తెలుగు ఇండస్ట్రీని కాపాడుతారో లేక వారి వారి ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తారో చూడాలి.
  •  
  •  
  •  
  •  
  •  
  •