సూపర్ కృష్ణకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. కొత్త కొత్త దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తూ వారి విజయానికి ఎన్నో బాటలు వేశారు. అలాంటిది అప్పుడే ఇండస్ట్రీలో బాలసుబ్రమణ్యం అడుగుపెట్టిన సమయంలో ఘంటసాల శఖం ముగుస్తున్న వేళ అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ అప్పట్లో రామకృష్ణ అనే గాయకుడుని ప్రోత్సహించి వారి పాటలన్ని అతడి చేస్తా పాడించుకునేవారు. ఆ సమయంలో బాలుకి అవకాశాలు కూడా తక్కువగా వస్తుండటంతో బాలు కాస్త బాధపడేవాడట.

ఈ విషయం కృష్ణకు తెలిసి బాలసుబ్రమణ్యాన్ని పిలిపించుకొని మీరు ఎలాంటి బాధ పడవద్దని తాను ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తానని తాను చేసే సినిమాలలో పాటలన్ని మీ చేతే పాడించుకుంటానని బాలుని ఎంతో ప్రోత్సహించారట. బాలుని అప్పట్లో కృష్ణ ప్రోత్సాహం అందించడంతోనే బాలు ఈ స్థాయికి ఎదిగాడని అప్పటి దర్శక, నిర్మాతలు చెబుతుంటారు. కానీ ఒక నిర్మాత వలన బాలు-కృష్ణ మధ్య రెండేళ్ల పాటు అంతరం పెరిగిపోయిందట.

కృష్ణతో ఒక నిర్మాత సినిమా తీస్తున్న వేళ బాలుకి ఇవ్వవలసిన పారితోషకం సరిగ్గా ఇవ్వకపోవడంతో పాటు తాను బాలుతో మాట్లాడిన మాటలను ఆ తరువాత హీరో కృష్ణకు వేరే రకంగా చెప్పడంతో కృష్ణకు కోపం వచ్చేసిందట. ఆ సమయంలో బాలుని పిలిపించుకొని మీరు పాడకపోతే నా సినిమాలలోని పాటలు హిట్ కావని మీరు అనుకుంటున్నారా అని బాలుపై ఆగ్రహం చూపడంతో బాలు కూడా మీకు పాడకపోయినా నేను బతకగలనని ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలకు లోనై అప్పటి వరకు సూపర్ హిట్ కాంబినేషన్ గా ఉన్న బాలు ఒక రెండేళ్ల పాటు కృష్ణ సినిమాలలో పాడలేదు.

కానీ ఈ గొడవకు కారణమైన నిర్మాత పేరు మాత్రం ఇప్పటికి బాలు-కృష్ణ చెప్పకపోవడం కొసమెరుపు. ఇక ఆ తరువాత కృష్ణ కొన్నేళ్ల పాటు రాజ్ సీతారాంతో పాటలు పాడించుకున్నారు. ఈ అగాధం మరింత ముదరకుండా గేయ రచయిత వేటూరి, సంగీత దర్శకులు రాజ్-కోటి వీరిద్దరూ కలసి బాలు-కృష్ణల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి తిరిగి కృష్ణ సినిమాలో పాటలు పాడేలా చొరవ తీసుకున్నారు. ఇక తిరిగి వారిద్దరూ కలసిన తరువాత బాలు-కృష్ణ కాంబినేషన్ లో అనేక సూపర్ హిట్ సాంగ్స్ తెరమీదకు వచ్చాయి. నిన్న బాలసుబ్రమణ్యం చనిపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ చలించిపోయి అతడికి ప్రగాఢ సానుభూతు తెలియచేసారు.