హీరోయిన్ ప్రణీత కరోనా సంక్షోభ సమయంలో తన వంతు సహాయాన్ని అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి తన వంతు సాయంగా 50 కుటుంబాలకు 2000 చొప్పున అందించింది. ఇక తాజాగా బెంగుళూరులో ఆటోడ్రైవర్లు కు శానిటైజర్లు, మాస్కులు పంపిణి చేసింది. బెంగుళూరులో ఆటోలు తిరగడం మొదలయ్యాయని ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రణీత.. ఆటోడ్రైవర్లు, కస్టమర్లను వేరు చేసే షీట్స్ ఎంతో ముఖ్యం అని చెప్పింది.

కావున 100 పైగా ఆటోడ్రైవర్లుకు షీట్స్ ను శానిటైజర్లును మాస్కులను పంపిణి చేసింది. ఇక స్వయంగా వంట చేస్తూ ఆహరం దొరకక అల్లాడుతున్న నిరుపేదలకు పంచిపెడుతుంది. ఇక ప్రణీత చేస్తున్న సేవలకు గాను నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

జూన్ చివరి నాటికి భారత్ లో 10 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందట..!

నాగబాబుతో నాకు సంబంధం లేదంటున్న పవన్ కళ్యాణ్