10 వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి హిమజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, డైరెక్టర్లపై హిమజ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు నాగార్జున బిగ్ బాస్ షో చూడరంటూ.. అలాగే డైరెక్టర్లు నాగార్జున చెవిలో ఏమి చెబితే అదే చెబుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడు కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

అలాగే హిమజ బిగ్ బాస్ షో నడుస్తున్న తీరుపై నామినేషన్లు, ఎలిమినేషన్లు ఓటింగ్ పై అభ్యతరాలు వ్యక్తం చేశారు. ఇంతక ముందు శ్రీముఖి, రాహుల్ పై కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీముఖికి బిగ్ బాస్ డైరెక్టర్లలో ఫ్రెండ్స్ ఉన్నారంటూ.. శ్రీముఖికి అనుకూలంగా వారు షో కట్ చేస్తున్నారంటూ హిమజ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.