ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి HIV వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ మహమ్మారి నుంచి బయటపడేయడానికి శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయోగాలు చేసినా దానికి విరుగుడు మందును కనిపెట్టలేకపోయారు. 20 ఏళ్ళ తరువాత HIV వైరస్ జాతిలో కొత్త వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు., అమెరికాలోని అబోట్ రీసెర్చ్ ల్యాబ్ లో జరిపిన పరిశోధనలలో ఇది బయటపడింది. దీనిని HIV-1 గ్రూప్ M, సబ్ టైపు Lగా పరిగణిస్తున్నారు.

HIV వైరస్ మొదటిసారిగా 2000 సంవత్సరంలో గుర్తింపబడింది. ఈ వైరస్ బయటపడినప్పటి నుంచి ఇప్పటి వరకు 75 మిలియన్ల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతానికి 38 మిలియన్ల మంది ఈ HIV వైరస్ బారిన పడి బాధపడుతున్నారు. రోజు రోజుకి వస్తున్న మార్పుల వలన ప్రజలు కూడా అవగాహనా పెంచుకోవడంతో HIV వైరస్ సోకకుండా తగిన రక్షణను తీసుకుంటున్నారు.