కరోనా వైరస్ తో హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో మృతిచెందాడు. 41 యేళ్ల నిక్ కార్డెరో ఏప్రిల్ లో కరోనా పాజిటివ్ రావడంతో అప్పటి నుండి లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌ అత‌ని కుడికాలిలో ర‌క్తం గ‌డ్డం క‌ట్ట‌డంతో వైద్యులు ఆయ‌న‌ కాలును సైతం తీసేశారు. తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాసవిడిచినట్లు అతని భార్య‌ అమండ క్లూట్స్ తెలియచేసింది. ఇక నిక్ కార్డెరో కి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు.

ఇక 90 రోజుల పాటు కరోనాతో పోరాడి నిక్ మృతి చెందాడు. ఇక కార్డిరో.. బుల్లెట్స్ ఓవ‌ర్ బ్రాడ్‌వే, రాక్ ఆఫ్ ఏజెస్‌, వెయిట్ర‌స్‌, ఎ బ్రాంక్స్ టేల్ వంటి ప‌లు చిత్రాల్లో న‌టించారు.

కరోనా కేసుల్లో రష్యాను దాటి మూడవ స్థానానికి చేరిన భారత్.. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కేసులు..!

వెంకటేష్ పెద్ద కొడుకు లుక్..!