తొలిసారి తూర్పు గోదావరి జిల్లాలో కరోనా సోకిన వ్యక్తులకు ఇంటి దగ్గరే చికిత్స తీసుకునే అవకాశం కల్పించారు. రాజమహేంద్రవరం ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకడంతో వారికి హోం ఐసోలేషన్‌ లో ఉంటూ చికిత్స తీసుకునే అవకాశాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కల్పించారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవుతున్న తరుణంలో ఇతర దేశాల తరహాలో స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఇక వారు తమిళనాడు నుండి రావడంతో తొలుత ట్రూనాట్‌, తర్వాత ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయగా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా వచ్చింది. వారు ఇంటిదగ్గరే చికిత్స తీసుకోవడానికి మొగ్గు చూపడంతో వారికి పల్స్ ఆక్సీమీటర్ అవసరమైన మందులతో కూడిన కిట్ ను ఆరోగ్య శాఖ అధికారులు అందించారు. ‌

ప్రపంచం మొత్తం జ్యోతి కుమారి గురించే చర్చ, ఆమె చేసిన సాహసం ఒక చరిత్రాత్మకం

దేశవ్యాప్తంగా 125000 దాటిన కరోనా బాధితులు.. 3720 మృతులు