సరిగ్గా పెళ్ళైన వారం కూడా కాకముందే హనీమూన్ లో ఉన్న భర్తతో గొడవలు కావడంతో ఏకంగా తన భర్త తనను వేధిస్తున్నాడని కేసు పెట్టి సంచలనం కలిగించింది హాట్ బాంబు పూనమ్ పాండే. ఆ తరువాత అతడిపై ఎన్నో విమర్శలు చేసింది. పెళ్ళైన దగ్గర నుంచి తనను చిత్ర హింసలు పెడుతున్నాడని ఇలా అనేక ఆరోపణలు చేయడంతో అతగాడిని పోలీసులు అరెస్ట్ కూడా చేసేసారు. ఇదంతా మీడియాలో హాట్ హాట్ గా డిస్కషన్ జరుగుతున్న దరిమిలా ఇప్పుడు మరోసారి అందరకి షాక్ ఇస్తూ భర్తపై పెట్టిన కేసులను విత్ డ్రా చేసేసుకొని భర్తను విముక్తుడిని చేసింది.

ఇలా ఎందుకు చేసావని అడిగితే మాత్రం త బర్త శ్యామ్ ఏడుస్తున్నాడని, అతడి ఏడుపు తట్టుకోలేక తాను కేసు వెనక్కు తీసుకున్నట్లు చెప్పుకొస్తుంది. గత ఏడాదిన్నరగా తనను శ్యామ్ వేధిస్తూనే ఉన్నాడని, కానీ పెళ్ళైన తరువాత మారిపోతాడనుకుంటే ఇప్పుడు కూడా అతడు చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని చెప్పుకొస్తుంది. గతంలో తనను హింసించినప్పుడు కూడా తరువాత ఏడ్చేవాడని, తాను ఇక ఎప్పుడు నీతో గొడవపడననేవాడని కానీ తనతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడని అతడి పద్ధతి మార్చుకోలేదని, కానీ అతడు ఏడ్చడంతో తాను కరిగిపోయానని చెబుతుంది.

మరోసారి ఇలానే తన భర్త చిత్రహింసలు పెట్టాడని పోలీసులకు ఎప్పుడైనా పిర్యాదు చేస్తే పోలీసులు పూనమ్ పాండేకు నాలుగు చివాట్లు పెట్టి పంపించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. తన భర్త ఒకవైపున చిత్ర హింసలు పెడుతున్నాడని చెబుతూనే అతడు ఏడుస్తున్నాడని అతడిని ఏమి చేయవద్దని కేసులు ఇలా వెనక్కు తీసుకుంటుంటే, పోలీసులేమైనా ఆట బొమ్మలా ఆమె చెప్పినట్లు చేయడానికి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడు ఘంటసాలకు జరిగిన అవమానం ఇప్పుడు బాలుకి జరిగిందని అభిమానుల ఆవేదన

విలాసాలనే మాట నేను ఎప్పుడో మర్చిపోయానంటున్న అనిల్ అంబానీ