ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించింది. జూన్ 8 నుండి రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లను, రెస్టారెంట్లను ఓపెన్ చేసుకోవచ్చని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖలో మీడియా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా హోటళ్లు నడిపే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

మూడు నెలల నుండి లాక్ డౌన్ కారణంగా హోటళ్ల యాజమానులు బాగా ఇబ్బంది పడ్డారని.. కావున ఈ క్రమంలో కరోనాపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ హోటళ్ళను నడపాలని ఆయన సూచించారు. దీనిపై గల మార్గదర్శికాలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

గుంటూరు కూరగాయల మార్కెట్ సీజ్.. ఓ వ్యాపారి నుండి 26 మందికి కరోనా పాజిటివ్..!

కరోనాకు మందు కనిపెట్టానంటున్న టాలీవుడ్ దర్శకుడు.. ట్రయల్స్ కోసం కేసీఆర్‌కు లేఖ..!