బెర్లిన్ లో జరుగుతున్న యూరోపియన్ ఎలక్ట్రానిక్స్ ఫెయిర్ లో 5జీ మోడెమ్ తో కూడిన మొదటి స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ హువాయ్ సంస్థ ప్రవేశపెట్టింది. 5జీ నెట్వర్క్ కు అనుకూలంగా ఉండే మోడెమ్ ను తాయారు చేసిన మొదటి స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ అని హువాయ్ సంస్థ తెలియచేస్తుంది. హువాయ్ రూపొందించిన 5జీ మోడెమ్ స్మార్ట్ ఫోన్ కు కిరిణ్ 990 అని నామకరణం చేశారు. 

క్వాల్ కామ్ మరియు శాంసంగ్ అందించే ప్రాసెసర్ కంటే కిరిణ్ 990… 7 రేట్లు అధికంగా శక్తివంతమైందిగా పని చేస్తుందని హువాయ్ సంస్థ తెలియచేస్తుంది. త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఇప్పటి నుంచే అన్ని మొబైల్ సంస్థలు తమ కొత్త ఫోన్ లలో 5జీ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా హువాయ్ సంస్థ 5జీ  మోడెమ్ కలిగిన ప్రాసెసర్ రూపొందించి అందరికన్నా ముందు వరుసలో నిలుచుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •