ఓ హైదరాబాదీకి ఆధార్ సంస్థ షాక్ ఇచ్చింది. మీ పౌరసత్వం నిరూపించుకోండంటూ ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సత్తార్ ఖాన్ అనే వ్యక్తికి ఈ నోటీలు అందడంతో కలకలం రేగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో కొంత మంది సిఏఏ, ఎన్ఆర్సి లపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆధార్ సంస్థ నోటీసులు జారీచేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

మీరు భారత్ కు చెందిన వారేనని నిరూపించే ఒరిజినల్ సర్టిఫికెట్లతొ సహా విచారణకు హాజరు కావాలని.. మీరు నకిలీ సర్టిఫికెట్లతొ ఆధార్ తీసుకున్నారు. కావున మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక విచారణకు రాకపోతే చర్యలు తప్పవని ఆధార్ సంస్థ తెలియచేసింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •