కుటుంబంతో కలసి సరదాగా సినిమాకు వెళితే, సినిమా మొదలయ్యే ముందు, సినిమా మధ్యలో వచ్చే రణగణ ధ్వనుల యాడ్స్ తో ప్రేక్షకులకు మనశాంతి లేకుండా చేస్తున్నారు థియేటర్ యాజమాన్యం. ఇలాంటి పరిస్థితే ఒక ప్రేక్షకుడికి ఎదురవడంతో నేరుగా కంప్లైంట్ ఇవ్వడంతో ఆ మల్టీప్లెక్స్ థియేటర్ కు షాక్ తగిలింది.

విజయ గోపాల్ అనే ప్రేక్షకుడు సినిమా చూడటానికి కాచిగూడ ఐనాక్స్ మల్టీప్లెక్స్ కు వెళ్లాడు, కానీ దాదాపుగా సినిమా మొదలు పెట్టకుండా 20 నిమిషాల పాటు యాడ్స్ వేయడంతో విసుగు చెంది దగ్గరలోని సుల్తానా బజార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ మల్టీప్లెక్స్ పై కంప్లైంట్ ఇచ్చాడు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ సిబ్బంది కాచిగూడ ఐనాక్స్ తమ పరిధిలోకి రాదని చెప్పడంతో నేరుగా కన్స్యూమర్ ఫోరమ్ లో పిటిషన్ దాఖలు చేయడంతో వారు పోలీస్ శాఖ వారిని ఐనాక్స్ మల్టీప్లెక్స్ పై కేసు నమోదు చేయాలని కోరడంతో యాజమాన్యం కంగుతిన్నారు. ఐనాక్స్ థియేటర్స్ దేశవ్యాప్తంగా చాల ప్రాంతాలలో ఉన్నాయి. 

చాల మంది యాడ్స్ గోల భరించలేక యాడ్స్ ముగిసే వరకు చికాకుగా సీట్లలో కూర్చుని ఎప్పుడు సినిమా మొదలవుతుందిరా బాబు అనుకునే వారికి విజయ గోపాల్ కేసు పెట్టడంతో కొంత ఉపశమనం లభించింది. అంటే సినిమా 2 గంటల సేపు ఉంటే, దాదాపుగా 20 నిమిషాలు యాడ్స్ ప్రదర్శిస్తున్నారంటే యాడ్స్ రూపంలో ఎంత ఆదాయం వస్తుందో ఇట్టే చెప్పవచ్చు.
  •  
  •  
  •  
  •  
  •  
  •