చైనాలో మొదలైన కరోనా వైరస్ కలకలం ఆ దేశం దాటి పక్క దేశాలను కూడా చుట్టుముడుతుంది. తాజాగా చైనా, హాంకాగ్ ఇతర దేశాల నుండి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుల్లో భయాలు నెలకొన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించిన, కనిపించకపోయినా ముందోస్తుగా డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో హైదరాబాద్ లోని చికిత్యల నిమిత్తం నగరంలోని ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. వారికి సంబంధించిన బ్లడ్ శాంపిళ్లను సేకరించి పుణెలోని వైరాలజి ల్యాబ్ కు పంపించారు.

ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివసించే అమర్నాధ్ రెడ్డి ఇటీవల కాలంలో చైనా నుండి వచ్చాడు. అక్కడి నుండి వచ్చిన రోజు బాగానే ఉన్న అతను శనివారం అనారోగ్యం పాలయ్యాడు. ఆ తరువాత కోలుకున్న అతను పీవర్ ఆసుపత్రికి చికిత్య నిమిత్తం వచ్చాడు. కరోనా వైరస్ అనుమానిత కేసుగా నమోదు చేసిన డాక్టర్లు అతన్ని వెంటనే ఐసోలేటెడ్ వార్డులో ఇన్ పేటెంట్ గా చికిత్య అందిస్తున్నారు. అదే తరహాలో ఆదివారం నాడు మరో రెండు కరోనా అనుమానిత కేసులు ఆసుపత్రికి చేరుకున్నాయి. ఈ ముగ్గురిని ప్రత్యేకంగా ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్య అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •