ఈ సోషల్ మీడియా యుగంలో యువకుల చేతిలో మోసపోయిన యువతుల కేసులు ఎక్కువగా వస్తుండటంతో పోలీసులు కూడా కాస్త కలవరానికి గురవుతున్నారు. ఎన్ని వందల వేల కిలోమీటర్ల అన్న సంబంధం లేదు పేస్ బుక్ లో చిన్న పరిచయం ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది. ఈ పరిచయాలతో కొన్ని సాఫీగా సాగుతున్న ఎక్కువ శాతం మాత్రం మోసపోయిన యువతులు దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక వీడియోను రూపొందించారు. ఒక యువకుడు చేతిలో మోసపోయిన యువతి గాధను అందులో చూపించి చివరకు ఎన్టీఆర్ సందేశాన్ని కూడా అందులో పొందుపరిచారు.

ఆ వీడియోలో ఎన్టీఆర్ అపరిచిత వ్యక్తులతో స్నేహం అంత మంచిది కాదని, అలాంటి పరిచయాలకు దూరంగా ఉండాలని గతంలో ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మరోసారి పోలీసులు ఎన్టీఆర్ పాత వీడియోను పోస్ట్ చేసి యువతి, యువకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇంత క్లారిటీగా పోలీసులు వీడియో రూపంలో చెప్పినా తాము ఇంకా అలానే తెలియని వారితో పరిచయాలు పెంచుకొని మోసపోతాం అంటే మాత్రం మీ కర్మకు మీరే బాధ్యులు.