ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంకా ఒక్క పెట్టుబడి కూడా రాలేదని, ఉన్నవాటిని ప్రభుత్వ విధానాలతో వెనక్కు వెళ్ళిపోతున్నాయని ప్రతిపక్ష టీడీపీ పార్టీ గగ్గోలు పెడుతుంది. జగన్ సర్కార్ పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ కంపెనీలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటిక్ టెక్నాలజీ సంస్థ దాదాపుగా 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ సర్వీస్ సెంటర్ ను కృష్ణ, గుంటూరు, నెల్లూరు, చిత్తూర్ జిల్లాల మధ్య నెలకొల్పే అవకాశం ఉంది. దీని వలన మొదటి విడతలో 400 మందికి ఉపాధి లభించనుంది. కాగా ఈ సంస్థకు హైబ్రిడ్ ఎలెక్ట్రికల్ వాహనాల టెస్టింగ్ సెంటర్ గా మంచి పేరుండటం విశేషం. ఏ కంపెనీ నెలకొల్పడంతో మరిన్ని పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •