గత కొన్నేళ్లుగా మహమ్మద్ షమీ కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయని అందరకి తెలిసిన విషయమే. షమీ భార్య హసిన్ జహాన్ అతడిపై కేసులు పెడుతూ షమీతో పాటు అతడి కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారని ఇలా అనేక ఆరోపణలు చేసింది. ఒకసమయంలో షమిని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధపడ్డారు. ప్రతిసారి ఆమెతో రాజీ కుదుర్చుకున్నా ఏమాత్రం తగ్గకుండా షమిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది.

దీనితో తీవ్ర వత్తిడిలోకి వెళ్లిన షమీ 2018లో మూడు సార్లు ఆత్మహత్యాయత్నం చేసాడట. ఈ విషయం షమీ స్వయంగా తెలియచేస్తూ నేను క్రికెట్లో ఉన్నత స్థానంలో ఉన్నా దానికి గురించి తాను ఏమి ఆలోచించలేదని, తనకు ఉన్న మానసిక ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. మేము 24వ అంతస్తులో ఉంటామని అక్కడ నుంచి తాను దూకుతానేమో అని నా కుటుంబసభ్యులు ఎప్పుడు తనతోనే ఉండేవారని, 24 గంటలు తనను కాపాడుతూ ఎవరొకరు తనకు తోడుగా ఉండేవారని షమీ చెప్పుకొచ్చారు.

అతడు అంత ఒత్తిడిలో కూడా తన బౌలింగ్ పదునుతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి టీమిండియాలో అగ్రస్థానంలో కొనసాగాడు. ఇప్పటికి అతడి బాధలు ఇంకా తీరినట్లుగా కనపడటం లేదు. అతడి భార్య ఇంకా మహమ్మద్ షమిపై కోపం మరింత పెంచుకుంటూ అతడిని ఎలాగైనా జైలుకి పంపించాలని కంకణం కట్టుకొని కూర్చుంది.

ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ కు 50 బిలియన్ డాలర్ల నష్టం

మందు బాబులతో దేశానికి మరోసారి తిప్పలు తప్పవా?