శ్రీలక్ష్మి ఏపీకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపుగా జగాన్ కు నమ్మకస్తులైన అనేక మంది అధికారులను ఎక్కడ ఉన్నా డిప్యుటేషన్ మీద ఏపీకి తీసుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కూడా తెలంగాణ నుంచి డిప్యుటేషన్ మీద ఏపీకి ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ ఎందుకు డిప్యుటేషన్ మీద పంపించాలన్నది సరైన కారణాలు చూపించలేదని కేంద్ర తిరస్కరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ పంపించడానికి అనుమతి ఇచ్చిన కేంద్రం మోకాలడ్డటంతో ఏపీ ప్రభుత్వం మరోసారి పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తుంది.

అందులో భాగంగానే ఢిల్లీ స్థాయిలో విజయసాయిరెడ్డి తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ శ్రీలక్ష్మి – విజయసాయి రెడ్డి ఈరోజు అమిత్ షాను పార్లమెంట్ ప్రాంగణంలో కలిశారు. తనను ఏపీకి డిప్యుటేషన్ మీద పంపించాలని శ్రీలక్ష్మి అమిత్ షాను కోరడం జరిగింది. అమిత్ షా… ఏపీకి శ్రీలక్ష్మిని డిప్యుటేషన్ మీద పంపించడానికి ఒప్పుకున్నాడా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.

జగన్ కేసులో అప్పట్లో జైలులో ఉన్న శ్రీలక్ష్మి… అదే జగన్ ప్రభుత్వంలో పని చేయడానికి వస్తుందంటే, జగన్ మీద కక్షతో తన మీద కుట్ర పూర్వకంగానే కేసు పెట్టారని అందులో జగన్ తప్పేమి లేదని బావిస్తుండవచ్చు. లేకపోతే జగన్ వలన జైలుకి వెళ్లిన శ్రీలక్ష్మి జగన్ ప్రభుత్వంలో పనిచేయడానికి ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పట్లో జగన్ వలన ఒక మహిళా ఐఏఎస్ జైలు పాలయిందని టీడీపీ సభ్యులు జగన్ ను బద్నామ్ చేయడానికి ప్రయత్నించేవారు. ఇప్పుడు అదే ఐఏఎస్ జగన్ ప్రభుత్వంలో పనిచేయడానికి డిప్యుటేషన్ మీద వస్తే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.  

 
  •  
  •  
  •  
  •  
  •  
  •