ఐసీసీ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవి రేసులోకి వచ్చాడు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్ ఉన్నారు. గంగూలీ పేరును ప్రతిపాదించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఇటీవల ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్‌ గోవర్‌ ఇదే అభిప్రాయం వ్యక్తం చేయగా, దక్షిణాఫ్రికా క్రికెటర్ గ్రేమ్ స్మిత్ కూడా ఐసీసీ చైర్మన్ పదవికి సౌరవ్ గంగూలీ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు.

ఇక స్మిత్‌తో పాటు సీఈవో జాక్వెస్‌ పాల్ కూడా గంగూలీ కి మద్దతు పలికాడు. అయితే శశాంక్ మనోహర్ తరువాత ఇంగ్లాండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌ మాజీ చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ఐసీసీ చైర్మన్‌ పదవి బరిలో ఉండగా, గ్రేమ్ స్మిత్ బహిరంగ మద్దతుతో అనూహ్యంగా గంగూలీ రేసులోకి వచ్చాడు. ఐసీసీ చైర్మన్ గా గంగూలీ ఉంటె మంచిదని అతను అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడాడు కాబట్టి అతని నాయకత్వ లక్షణాలు క్రికెట్ పరిజ్ఞానం చైర్మన్ గా విజయవంతమయ్యేందుకు దోహదం చేస్తాయన్నారు గ్రేమ్ స్మిత్.

శకుని పాత్ర చేసిన తరువాత తన కాళ్ళు విరగగొడతామన్నారు

తెలంగాణలో కొత్తగా మరో 45 పాజిటివ్ కేసులు