ఐసిఎంఆర్ మంగళవారం రెండవ జాతీయ సెరో సర్వే నివేదికలోని పలు కీలక విషయాలను వెల్లడించడం జరిగింది. దేశంలో 2020 ఆగష్టు నాటికి ప్రతి 15 మందిలో ఒకరు కరోనా భారిన పడినట్లు సర్వే నివేదిక అంచనా వేసింది. ఇక 29 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. వారిలో 6.6 శాతం మంది కరోనా భారిన పడినట్లు తెలిపారు. ఇక నగరాలు ధనిక ప్రాంతాలతో పోల్చుకుంటే మురికి వాడలలో కేసుల తీవ్రత రెండు రేట్లు ఎక్కువుగా ఉందని తెలిపారు.

ఇక రాబోయే రోజుల్లో పండగలు, శీతాకాలం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు కంటైన్మెంట్ అనుసరించాల్సిన అవసరం ఉందని.. ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ తెలిపారు. ఇక వయోజనుల్లో 7.1శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడినట్లు ఈ సర్వే అంచనా వేస్తోంది. మే నెలలో కన్నా ఆగష్టులో కేసుల సంఖ్య తగ్గింది. దీనిని బట్టి పరీక్షలు, డిటెక్షన్ల సంఖ్య పెరిగిందనే విషయం స్వష్టమవుతుందని ఆయన వెల్లడించారు. అదే విధంగా దేశంలో రికవరీల సంఖ్య 51 లక్షలు దాటింది. ప్రపంచంలోనే రికవరీల్లో ఇదే అత్యధికమని.. భారత్ కి ఇది సానుకూల ప్రభావమని బలరాం భార్గవ తెలియచేసారు.

బిగ్‌బాస్‌పై దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్.. ఆ కంటెస్టెంట్ కి నా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి..!

సీఎంను అందరూ ఆ ఇంటి బిడ్డ అనుకుంటున్నారు.. జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!

బయటపడ్డ మరో భయంకరమైన వ్యాధి.. ఎలా సోకుతుందంటే..!