ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కనెక్ట్ టు ఆంధ్రా’ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఇచ్చిన ‘కనెక్ట్ టూ ఆంధ్రా’ పిలుపుకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ మేరకు తన ఐదేళ్ల ఎమ్మెల్యే జీతాన్ని ‘కనెక్ట్ టూ ఆంధ్రా’ కు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ చార్యులను కలసి లేఖ అందచేసినట్లు తెలియచేశారు. జగన్ అమ్మఒడి, నాడు-నేడు, నవరత్నాలు అమలుకు ‘కనెక్ట్ టూ ఆంధ్రా’ పేరుతో ప్రజా భాగస్వామ్యాన్ని కోరడం మంచి విషయమని ఆళ్ల పేర్కొన్నారు. దీనికి సీఎం జగన్ చైర్మన్ గా, సీఎస్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.