ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మొదటి టీ20 మ్యాచ్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఆడే టీ20 మ్యాచ్ 1000వ మ్యాచ్ కావడం విశేషం. దీనితో ఈరోజు జరిగే మ్యాచ్ చారిత్రాత్మకమైన మ్యాచ్ గా నిలవనుంది. బంగ్లాదేశ్ తో టీమిండియా ఎనిమిదవ టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టీ20 మ్యాచ్ లను టీమిండియా గెలుచుకోవడం జరిగింది. ఈరోజు తొమ్మిదవ మ్యాచ్ లో కూడా గెలవాలని ఉవ్విళూరుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో మంచి ఫామ్ లో ఉన్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హాసన్ లేకపోవడంతో బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. మరోవైపున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ సిరీస్ కు రెస్ట్ తీయసుకోవడంతో అతడి స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.