దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా భారత్ లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 24248 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 697413 కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 425 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 19693 కి చేరింది.

ఇక మొత్తం బాధితుల్లో 424433 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 253283 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో అత్యధిక కేసుల్లో భారత్ రష్యాను దాటి మూడవ స్థానానికి చేరుకుంది. ఇక ప్రపంచంలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరగా మరణాల్లో మాత్రం 8వ స్థానంలో ఉంది. ఇక అమెరికాలో 2964127 కరోనా పాజిటివ్ కేసులతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా, 1579837 కేసులతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. ఇక తాజాగా భారత్ 697413 కేసులతో మూడవ స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా నిన్న 180596 టెస్టులు చేయగా ఇప్పటివరకు మొత్తం టెస్టుల సంఖ్య 9969662 కి చేరుకుంది.

తెలంగాణపై విరుచుకుపడుతున్న కరోనా.. 5290 శాంపిల్స్ పరీక్షించగా, 1590 పాజిటివ్ కేసులు..!

వెంకటేష్ పెద్ద కొడుకు లుక్..!