దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత వారం రోజులుగా భారత్ లో రోజుకు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 22752 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 742417 కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 484 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 20642 కి చేరింది. గత వారంరోజుల్లోనే దేశంలో లక్షా 60 వేల కేసులు, 3242 మరణాలు సంభవించాయి.

ఇక మొత్తం బాధితుల్లో 456831 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 264944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా భారిన పడి కోలుకుంటున్న వారి శాతం 61.3 గా ఉంది. ఇక ప్రపంచంలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉండగా, మరణాల్లో మాత్రం 8వ స్థానంలో ఉంది.

చిన్న ట్రిక్ ద్వారా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్‌లు చూడవచ్చు..!

లోకేశా ఏమిటి ఈ రచ్చ, ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎలాగయ్యా సామి