ఈనెల 22వ తారీకు మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అందులో భాగంగా పాకిస్థాన్ గగనతలంలో నుంచి అమెరికా వెళ్ళవలసి ఉంది. దాని కోసం భారత్ ప్రభుత్వం పాకిస్థాన్ గగనతలం వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఇంకా పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల భారత ప్రధమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఐస్లాండ్ పర్యటనకు వెళ్ళవలసి ఉండగా పాకిస్థాన్ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ మీదకు కయ్యానికి కాలుదువ్వడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్ ప్రభుత్వం… ప్రధాని మోదీ పర్యటనకు అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.