చైనీస్ యాప్‌లకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్ లో టిక్ టాక్ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసిన కేంద్రం.. చైనీస్‌ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందన్న ఉద్దెశంతో వాటిని నిషేధించినట్లు తెలిపింది.

ఇక దీనిపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. చైనాలో భారత్ కు చెందిన వార్త పత్రికలు, వెబ్ సైట్లను ప్రజలకు దూరం చేసేందుకు చర్యలు చేపట్టింది. చైనాలో భారత్ మీడియాకు చెందిన వెబ్ సైట్లను ఇక మీదట వర్చువల్ ప్రైవేటు నెట్వర్క్ సర్వర్ ద్వారా మాత్రమే పొందగలిగేలా నిభందనలు మార్చింది. ఇక భారత్ టీవీ చానళ్లను ప్రస్తుతానికి ఐపీ టీవీ ద్వారా పొందవచ్చు. ఐ ఫోన్లు, డెస్క్ టాప్ ల్లో ఎక్ష్ప్రెస్స్ వీపీఎన్ ప్రస్తుతం పనిచేయడం లేదని తెలుస్తుంది. చైనా వార్తపత్రికలు, వెబ్ సైట్స్ పై భారత్ నిషేధం విదించకపోయినప్పటికీ చైనా ఈ విధంగా తన వక్ర బుద్దిని చాటుతుంది.

మాస్క్ పెట్టుకోమన్నందుకు మహిళను దారుణంగా కొట్టాడు.. వీడియో వైరల్..!

బ్రేకింగ్.. కరోనా తర్వాత రాబోయే మరో ప్రమాదకర వైరస్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు..!