ప్రపంచవ్యాప్తంగా జనాభా పరంగా చూసుకున్నా, ఇండియా రెండవ స్థానంలో ఉంది. అలాగే ఇంటర్నెట్ పరంగా చూసుకున్నా ప్రపంచంలో చైనా తరువాత స్థానంలో భారత్ ఉండటం విశేషం ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ అఫ్ ఇండియా (IAMAI) లెక్కల ప్రకారం ప్రతి నెల 451 మిలియన్ల మంది క్రియాశీలక యూజర్లు ఉన్నారట. 12 ఏళ్ళు అంతకంటే ఎక్కువ మంది 385 మిలియన్ల మంది ఉన్నారు.

5 నుంచి 11 ఏళ్ళ మధ్య వారు 66 మిలియన్ల మంది ఇంటర్నెట్ వాడుతుండగా, ఇక భారతీయ నగరాలలో 11.7 మిలియన్ల ఇంటర్ వాడకంలో ముంబై నగరం మొదటి స్థానంలో నిలిచింది. జియో వచ్చిన తరువాత పల్లెటూరు నుంచి పట్టణాలలో ఉండే ప్రజల వరకు ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు.