కరోనా బాధితులను కాపాడడం కోసం డాక్టర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఎందరో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది కరోనా భారినపడ్డారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 382 డాక్టర్లు కరోనా భారినపడి మృతి చెందారు. మృతి చెందిన వారిలో అత్యంత పిన్న వయస్కుడు 27 డాక్టర్ కాగా, అత్యంత వృద్ధుడు 85 ఏళ్ళ డాక్టర్ ఉన్నారు.

బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పార్లమెంట్ లో కరోనా వైరస్ పరిస్థితి పై ప్రకటన చేశారు. కరోనా పోరులో మృతి చెందిన డాక్టర్ల వివరాలను వెల్లడించకపోవడం వల్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మృతి చెందిన డాక్టర్ల వివరాలను వెల్లడించారు.

భారత్ లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. 24 గంటల్లోనే దాదాపు లక్ష కేసులు..!

తెలంగాణలో 1,000 దాటిన కరోనా మరణాలు..!

‘ఖైదీ’ దర్శకుడితో కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్..!