దేశవ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టిస్తుంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 48,661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 13,85,522 కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 705 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 32,063 కి చేరింది.

ఇక ఇప్పటివరకు 8,85,576 మంది కరోనా నుండి కోలుకోగా, 4,67,882 మంది కరోనాతో పోరాడుతున్నారు. ఇక ప్రపంచంలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉండగా, మరణాల్లో మాత్రం 7వ స్థానంలో ఉంది. ఇక నిన్న ఒక్కరోజే 4,42,263 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇక నుండి బియ్యం కార్డే ఇన్‌కమ్ సర్టిఫికెట్..!

మాస్ హీరోకి కరోనా పాజిటివ్..!