భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 83,808 పాజిటివ్ కేసులు, 1,054 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 49,30,236 కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 1,136 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 80,776 కి చేరింది. కరోనాతో మరణిస్తున్న వారందరు ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్వష్టం చేసింది.

ఇక ఇప్పటివరకు 38 లక్షల మంది కోలుకోగా, ఇంకా 9,90,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.58 శాతం ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78 శాతంగా ఉంది. ఇక మరణాల రేటు 1.64 శాతంగా ఉంది. ఇక మరణాలలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్, బ్రెజిల్ తరువాత స్థానంలో కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,72,845 కరోనా టెస్టులు చేశారు.

ప్రముఖ ఓటిటిలో ‘నాంది’ మూవీ..!

గోవా ట్రిప్ లో ప్రియుడితో కలిసి నయన్ ఎంజాయ్..!