భారత్ లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 92,071 పాజిటివ్ కేసులు, 1,136 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 48,46,428 కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 1,136 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 79,722 కి చేరింది.

ఇక ఇప్పటివరకు 37,80,107 మంది కరోనా నుండి కోలుకోగా, ఇంకా 9,86,598 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.58 శాతం ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.64 శాతంగా ఉంది. ఇక మరణాలలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్, బ్రెజిల్ తరువాత స్థానంలో కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,78,500 కరోనా టెస్టులు చేశారు.

విశాల్ రాజకీయరంగ ప్రవేశం..!

తెలంగాణలో కొత్తగా 1,417 పాజిటివ్ కేసులు

బిగ్ బాస్ నుండి ఒకరు అవుట్ ఒకరు ఇన్..!