భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 90,123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 50,20,360 కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 1,290 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 82,961 కి చేరింది. కరోనాతో మరణిస్తున్న వారందరు ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్వష్టం చేసింది.

ఇక నిన్నఅత్యధికంగా 82,000 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 39,42,360 మంది కోలుకున్నారు. ఇంకా 9,95,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 19.84 శాతం ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.53 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.63 శాతంగా ఉంది. ఇక మరణాలలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్, బ్రెజిల్ తరువాత స్థానంలో కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,16,842 చేయగా, ఇప్పటివరకు మొత్తం టెస్టులు సంఖ్య 5,94,29,115 కి చేరింది.

భారత్ వ్యాక్సిన్లు ఏ దశలో ఉన్నాయంటే..!

స్విగ్గీ మోసంపై డెలివరీ బాయ్స్ తీవ్ర నిరసన.. ఎట్టికేలకు దిగివచ్చిన యాజమాన్యం..!