దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 46433 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఇక దేశవ్యాప్తంగా తాజాగా 195 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 1568 కి చేరింది. ఇక మొత్తం బాధితుల్లో 12727 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 32138 మంది చికిత్స పొందుతున్నారు. కాగా భారత్ లో ఒకేరోజులో కరోనా భారిన పడిన అత్యధిక కేసులు మరణాలు ఇదే కావడం గమరణార్ధం. కాగా దేశంలో వైరస్ భారిన పడి కోలుకున్న వారి శాతం 25.36 గా ఉంది. ఇక ఇప్పటివరకు 11 లక్షల మందికి కరోనా వైద్యపరీక్షలు జరిపినట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్నా.. ఇది త్వరలోనే స్థిరీకరణ చెందుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాలలోను కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. ఏపీలో ఇప్పటివరకు 1717 మంది కరోనా భారిన పడగా, 34 మంది ఈ వైరస్ భారిన పడి మృతి చెందారు. కాగా 589 మంది ఈ మహమ్మారి నుండి కోలుకోగా, 1094 మంది చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణాలో నిన్న కొత్తగా మూడు కేసులు నిర్ధారణ కావడంతో దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1085 కి చేరగా, 29 మంది ఈ వైరస్ భారిన పడి మృతి చెందారు. కాగా 585 మంది ఈ మహమ్మారి నుండి కోలుకోగా, 500 మంది చికిత్స పొందుతున్నారు.

సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న భారతీయునికి 20 కోట్ల జాక్ పాట్..!

‘మహాభారతం’ పనులు మొదలు పెడతానంటున్న రాజమౌళి..!

గుడ్ న్యూస్.. కరోనాను అడ్డుకునే యాంటీబాడీ గుర్తింపు..!

చైనాలో షాకింగ్ ఘటన.. ఓ యువతికి తరుచుగా తలనొప్పి రావడంతో..!