భారత్ లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో అల్ టైం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 69,878 పాజిటివ్ కేసులు, 945 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 29,75,701 కి చేరింది. దేశంలో 24 గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 977 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 55,794 కి చేరింది.

ఇక నిన్న రికార్డు స్థాయిలో 63,631 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 22,22,577 కి చేరింది. ఇంకా 6,97,330 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.

విటమిన్ ట్యాబ్లేట్స్ ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యానికి ప్రమాదకరమే

‘బిగ్ బాస్’‌లోకి విలేజ్ షో గంగవ్వ..!

టీవీ చూసినా, క్యారమ్ బోర్డ్ ఆడినా, పాటలు విన్నా బారి జరిమానా తప్పదు