దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర ఉగ్రరూపం దాల్చుతుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18653 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 585493 కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 507 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 17400 కి చేరింది.

ఇక మొత్తం బాధితుల్లో 347979 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 220114 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా భారిన పడి కోలుకుంటున్న వారి శాతం 58.6 గా ఉంది. ఇక ప్రపంచంలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉండగా, మరణాల్లో మాత్రం 8వ స్థానంలో ఉంది. ఇక ఇప్పటివరకు దేశంలో 88,26,585 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కుష్బూ కీలక పాత్ర..?

బిగ్ బాస్-4 లో పాల్గొనబోయే సెలబ్రిటీస్..?