దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6088 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 118447 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియచేసింది. ఒకేరోజు పాజిటివ్ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 148 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 3583 కి చేరింది.

ఇక మొత్తం బాధితుల్లో 48534 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 66330 మంది చికిత్స పొందుతున్నారు. కాగా భారత్ లో గత పది రోజుల నుండి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కాగా దేశంలో వైరస్ భారిన పడి కోలుకున్న వారి శాతం 40 శాతంగా ఉంది. ఇక 2.94 శాతం మందికి ఐసీయూ లో చికిత్స అందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

కరోనాపై గూగుల్, యాపిల్ సంయుక్తంగా సరికొత్త టెక్నాలజీ

15 ఏళ్ళ యువతి సైకిల్ పై తన తండ్రితో 1200 కిమీ ప్రయాణం, పెద్ద సాహసమే