దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6654 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 125101 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియచేసింది. ఇక దేశవ్యాప్తంగా తాజాగా 137 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 3720 కి చేరింది. ఇక మొత్తం బాధితుల్లో 51783 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 61959 మంది చికిత్స పొందుతున్నారు.

కాగా భారత్ లో గత రెండు వారల నుండి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మహారాష్ట్రలో కరోనా అత్యధికంగా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు అక్కడ కరోనా భారిన పడిన వారి సంఖ్య 44582 కి చేరుకోగా, అందులో 12583 మంది కరోనా నుండి కోలుకోగా, 1517 మంది మృతి చెందారు. ఇక తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీలలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది.

ఏమిటి ఈ దిక్కుమాలిన నిర్ణయాలంటూ ట్రంప్ ను మీడియా కడిగిపారేస్తుంది

ఇప్పటికైనా గురూజీని వదిలేయండి సామి, ఇక మీదట అలా చేయడులే